POLITICS: బీఆర్ఎస్-బీజేపీ బంధానికి బీజం..?
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ.. బీజేపీ–బీఆర్ఎస్ స్నేహబంధానికి తొలి అడుగు అంటూ వ్యాఖ్యలు;
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రామ్‌చందర్ రావు నియామకంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్ ఈ ఎంపికను "బీజేపీ–బీఆర్ఎస్ స్నేహబంధానికి తొలి అడుగు"గా అభివర్ణించగా, బీజేపీ కేడర్‌లోనూ అసంతృప్తి వెల్లివిరుస్తోంది. బీఆర్ఎస్ సంక్షోభంలో ఉన్న వేళ బీజేపీ దూకుడుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉండగా, పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ అవినీతి, కేసులపై పోరాటం సాగిస్తున్న బీజేపీ, అదే పార్టీతో పొత్తుకు సిద్ధమవుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని చుట్టుముట్టాయి. ఈ పరిణామాల వెనుక కేంద్రంలో ఎలాంటి రాజకీయ లెక్కలు నడుస్తున్నాయన్నదానిపై చర్చ మొదలైంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ కూర్పులు, పొత్తులు రాష్ట్ర రాజకీయ పటాన్ని ఏ రూపంలో మలుస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.
రాజకీయాల్లో కొత్త చర్చ

ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులు కేసుల వలయంలో చిక్కుకోవడం, కేసీఆర్ తరుచుగా ప్రజల ముందు కనిపించకపోవడం వల్ల పార్టీ నిస్సహాయ స్థితిలో ఉన్న వేళ బీజేపీ ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నా, రాజకీయ వ్యూహాలు పూర్తిగా స్పష్టంగా లేవు. ఇదే సమయంలో బీజేపీ అధ్యక్ష పదవిని ప్రచారం లేని రామ్‌చందర్ రావుకు అప్పగించడం వెనుక ఎలాంటి రాజకీయం దాగుంది? బీఆర్ఎస్తో పొత్తు? లేక కవిత ఆరోపించినట్టు బీఆర్ఎస్ విలీనమే? అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు ఈటల, బండి సంజయ్ వంటి నేతలు ఎంతవరకు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు కేసీఆర్ కుటుంబంపై ఉన్న ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ స్కామం వంటి కేసుల్లో కేంద్ర విచారణ సంస్థల నిదానం కూడా అనుమానాలకూ తావిస్తోంది. ఈ నేపథ్యంలో, బీజేపీ – బీఆర్‌ఎస్ పొత్తు నిజమైతే, అది కాంగ్రెస్‌కు లాభంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనాభాలో వ్యతిరేకత ఎక్కువైతే, తెలంగాణలో బీజేపీకి ఇది ద్వితీయ వేవ్‌కాక, దెబ్బ తినే అంశంగా మారుతుందన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.