AP: గూగుల్‌తో ఏపీ చరిత్రాత్మక ఒప్పందం
ఢిల్లీలో గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. పదేళ్లలో రూ. 80 వేల కోట్లకుపైగా పెట్టుబడులు.. హాజరైన కేంద్రమంత్రులు నిర్మల, అశ్వినీ వైష్ణవ్
కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఏపీ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” పేరుతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.. ‘భారత్ ఏఐ శక్తి’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార అండ్ ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయు కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎపి ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఎంఓయుపై సంతకాలు చేశారు. విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న డేటా సెంటర్.. ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతిపెద్ద డేటా సెంటర్ గా నిలవనుంది. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ అతిపెద్ద డేటా సెంటర్, గూగుల్ క్లౌడ్, ఏఐ వర్క్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఉపయోగపనుంది. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులో కి రానున్నాయి.
అతిపెద్ద ఒప్పందం: చంద్రబాబు
ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్.. విశాఖలో అడుగు పెడుతోందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశాం.. ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నట్లు తేల్చి చెప్పారు. విశాఖకు గూగుల్‌ను తీసుకొస్తున్నామన సీఎం చంద్రబాబు వెల్లడించారు. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు రానున్నాయి.. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్‌టైమ్ డేటా కలెక్షన్లు కీలకమైనవి.. సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంటుంది.. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని తెలిపరు. అయితే, హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ నినాదాన్ని తీసుకొచ్చాం.. రాబోయే ఐదేళ్ల కాలంలో 15 బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామని గూగుల్ చెప్పడం సంతోషదాయకం అని చంద్రబాబు అన్నారు. ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం ఇకపై AI సిటీగా మారనుంది. డేటా సెంటర్ ద్వారా భారత్‌లో ఏఐ ఆధారిత ట్రాన్స్ఫర్మేషన్ను గూగుల్ సంస్థ వేగవంతం చేయనుంది. గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్‌తో సముద్ర గర్భ, భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించి, క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా ప్రాజెక్టును రూపకల్పన చేయబడింది. ఈ ప్రాజెక్ట్ 2028–2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టిస్తుంది.