Ponnam Prabhakar : గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని సక్సెస్ చేయండి
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనానికి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు పార్టీ ముఖ్యులంతా హాజరవుతారని తెలిపారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఖర్గే దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 500 మందిని సమ్మేళనానికి తరలించేందుకు నాయకులు కృషి చేయాలని పొన్నం సూచించారు.
మరోవైపు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం కోసం పీసీసీ ఆఫీస్ బేరర్లతో గాంధీభవన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, డీసీసీ అధ్యక్షులను సమన్వయం చేస్తూ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి ఈ కంట్రోల్ రూం పని చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. సమ్మేళనానికి సంబంధించి వివరాల కోసం పీసీసీ ఉపాధ్యక్షులు కైలాశ్ కుమార్(9494227444), సురేశ్‌కుమార్(9849013524), అఫ్సర్ యూసుఫ్ జాహి(9391158997), జగదీశ్వర్‌రావు(9000279999), ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్(9885298353)లను సంప్రదించాలని సూచించారు.