దేశప్రజల్ని ప్రధాని మోదీ మోసం చేశారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షల రూపాయల నగదు జమ చేస్తానని మాట తప్పారని మండిపడ్డారు. అంబర్‌పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. గాంధీనగర్ డివిజన్ ప్రచారం పాల్గొన్న కేటీఆర్... కష్టంలో, సుఖంలో ప్రజలతోనే ఉన్నామని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో 15వందల రూపాయలు, బియ్యం పంపిణీ చేశామని తెలిపారు. వరద సాయం కింద 10 వేల రూపాయలు అందచేశామన్న కేటీఆర్..... డిసెంబర్ 4 తర్వాత బాధితులు అందరికీ సాయం అందిస్తామని చెప్పారు. అగ్రనేతల్ని ప్రచారంలోకి దింపుతున్న బీజేపీకి.... అంత భయం ఎందుకని ప్రశ్నించారు.