ప్రైవేట్ టీచర్ రవి భార్య అక్కమ్మ ఆత్మహత్య..!
ఆర్థిక సమస్యలతో రెండు రోజుల క్రితం ప్రైవేటు టీచర్ రవి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన అతని భార్య ఆత్మహత్యకు పాల్పడింది.;
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలతో రెండు రోజుల క్రితం ప్రైవేటు టీచర్ రవి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన అతని భార్య ... సాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల ఆత్మహత్యతో వారి ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె అనాథలయ్యారు. పసి బిడ్డలను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు.