TFCC : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తప్పే.. తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రకటన

Update: 2025-03-21 13:00 GMT

బెట్టింగ్ యాప్‌లకు నటీనటులు ప్రచారం చేయడంపై తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) స్పందించింది. నటీనటుల జీవన విధానం మారడం వల్ల బెట్టింగ్ యాప్‌లాంటి ప్రచారాల్లో పాల్గొంటున్నారని పేర్కొంది. కొంతమంది తెలియక, మరికొంతమంది తెలిసి ప్రమోషన్ చేస్తున్నారని తెలిపింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ నిర్వహించే నటీనటులపై చర్యలు తీసుకోవాలని 'మా'ను కోరతామని, రెండు రోజుల్లో లేఖను అందిస్తామని తెలిపింది. సినిమా వారైనా, మరొకరైనా చట్టానికి, న్యాయానికి కట్టుబడి ఉండాలని టీఎఫ్‌సీసీ సూచించింది. బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై రెండు రోజులుగా సినిమా పరిశ్రమలో చర్చ జరుగుతున్నట్లు తెలిపారు. ఆ యాప్‌ల వల్ల సమాజానికి చెడు జరుగుతుంటే ప్రమోషన్లు చేయడం తప్పే అవుతుందని స్పష్టం చేసింది.

Tags:    

Similar News