జగిత్యాలలో ప్రోటోకాల్ పంచాయతి
కేంద్ర ఔషధ గిడ్డంగి, క్రిటికల్ కేర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకంపై జడ్పీ చైర్మన్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది;
జగిత్యాల జిల్లాలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. కేంద్ర ఔషధ గిడ్డంగి, క్రిటికల్ కేర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకంపై జడ్పీ చైర్మన్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శంకుస్థాపన తర్వాత గమనించిన మంత్రి కొప్పుల ఈశ్వర్.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా స్థాయిలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలలో జడ్పీ పేరు తప్పకుండా ఉండాలన్నారు. శిలాఫలకాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. కార్యక్రమం ముగియగానే.. అధికారుల శిలాఫలకాలను తొలగించారు.