Mancherial District : బెల్లంపల్లి గురుకులంలో ర్యాగింగ్ కలకలం!

Update: 2025-03-04 10:00 GMT

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఇంటర్మీడియట్ ఆకతాయి విద్యార్థులు జూనియర్ స్టూడెంట్స్ పై చిత్రహింసలతో వేధించిన ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించింది. దీంతో గురుకులం ప్రిన్సిపాల్ నలుగురు విద్యార్థులను కళాశాల నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాంఘిక సంక్షేమ బాలుర విద్యాలయంలో ఇటీవల చక్రధర్ అనే 8వ తరగతి స్టూడెంట్ను తమతో పాటు సిగరెట్ తాగాలని ఇంటర్ సీనియర్లు వేధించారు. ఇందుకు ఆ విద్యార్థి ఒప్పుకోకపోవడంతో బట్టలు విప్పి చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన కళ్లారా చూసిన టెన్త్ విద్యార్థి నిఖిల్ ప్రిన్సిపాల్ కు ర్యాగింగ్ జరుగుతున్న విషయాన్ని ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్ శ్రీధర్ ర్యాగింగ్కు పాల్పడిన ఇంటర్ విద్యార్థులను బెదిరించి ఈ విషయం వారి తల్లిదండ్రులకు వివరించారు. ఇకపై తాము ఎలాంటి తప్పు చేయమని, క్షమించాలని ఇంటర్ విద్యార్థులు ప్రాధేయపడ్డారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

Tags:    

Similar News