Raging: పశువైద్య కళాశాలలో ర్యాగింగ్.. 34 మంది విద్యార్థులు సస్పెండ్
Raging: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది.;
Raging: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. 20 మంది జూనియర్ విద్యార్థులు... కంప్లైంట్ బాక్స్‌లో లెటర్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన కాలేజీ యాజమాన్యం... 34 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే సీనియర్లు పద్ధతి మార్చుకోవాలంటూ ర్యాగింగ్‌కు పాల్పడినవారిని కాలేజీ యాజమాన్యం హెచ్చరించింది. అయితే వాళ్లు మాత్రం మారలేనట్లు జూనియర్ల ఆరోపిస్తున్నారు. తమను వేధిస్తున్నారంటూ వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకెళ్లడంతో... ర్యాగింగ్‌కు పాల్పడిన 34 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు.