Rahul Gandhi: చంచల్‌గూడ జైల్లో ముగిసిన రాహుల్‌ గాంధీ ములాఖత్‌..

Rahul Gandhi: చంచల్‌గూడ జైల్లో NSUI నేతలతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ములాఖత్‌ ముగిసింది.;

Update: 2022-05-07 09:01 GMT

Rahul Gandhi: చంచల్‌గూడ జైల్లో NSUI నేతలతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ములాఖత్‌ ముగిసింది. ఓయూలో వీసీ ఛాంబర్‌ ముందు నిరసన తెలిపి అరెస్టైన 18 మంది NSUI నేతలను పరామర్శించారు. రాహుల్‌తో పాటు భట్టికి మాత్రమే అనుమతి ఇచ్చారు జైలు అధికారులు. దాదాపు 25 నిమిషాలు వీరితో చర్చించారు. చంచల్‌గూడ జైలు నుంచి నేరుగా గాంధీభవన్‌కు చేరుకున్నారు. కాసేపట్లో జరిగే విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్.

Tags:    

Similar News