RAHUL: రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి: రాహుల్

భారత్‌ సమ్మిట్‌లో పాల్గొన్న రేవంత్.. ప్రపంచ రాజకీయాలు మారాయని వ్యాఖ్య;

Update: 2025-04-27 03:30 GMT

దేశంలో పాత తరం రాజకీయం అంతరించిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయం నడుస్తోందని అన్నారు. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలన్న రాహుల్.. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని వివరించారు. పదేళ్ల కిందటి నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన భారత్ సమ్మిట్ ముగిసింది. రెండు రోజులపాటు జరిగిన ఈ సమ్మిట్‌లో పలువురు మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు, విదేశీ ప్రతినిధులు హాజయ్యారు. బహుళత్వం, వైవిద్యం, పోలరైజేషన్‌ను అధిగమించడం, వేగవంతమైన న్యాయం, అనిశ్చితి కాలంలో ఆర్థిక న్యాయం, న్యాయం, ప్రపంచ శాంతిపై సదస్సులో చర్చలు జరిగాయి. రెండో రోజు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు.

రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

భారత్‌ సమ్మిట్-2025కు శుక్రవారమే రావాల్సి ఉందని... కానీ కాశ్మీర్‌కి వెళ్లానని.. క్షమించండి.. అంటూ రాహుల్ ఈ సమావేశంలో సభికులను కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సమ్మిట్‌ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించామని, దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చామని, మహిళలను కోటీశ్వరులను చేయడమే అజెండాగా పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

అదే మా లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HICCలో నిర్వహించిన భారత్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘మా ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు అనేక పథకాలు తీసుకొచ్చాం. దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రూ. 20 వేల కోట్ల రుణమాఫీ చేశాం. గత పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు’ అని అన్నారు.




Tags:    

Similar News