Hyderabad : మూసీలో తగ్గిన వరద ఉధృతి.. ఊపిరి పీల్చుకున్న పరీవాహక ప్రాంతాలు..
Hyderabad : హైదరాబాద్ జంట జలాశయాలకు వరద తగ్గుముఖం పట్టింది.;
Hyderabad : హైదరాబాద్ జంట జలాశయాలకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ఉస్మాన్‌సాగర్ పదమూడు గేట్లలో మూడు గేట్లను జలమండలి అధికారులు మూసివేశారు. ఉస్మాన్‌సాగర్‌కు 3వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, పది గేట్ల ద్వారా 6090 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1788 అడుగులుగా ఉంది.
హిమాయత్ సాగర్‌కు కూడా భారీగా ఇన్ ఫ్లో తగ్గింది. ప్రస్తుతం 4 వందల క్యూసెక్కుల వరద మాత్రమే ఉంది. ఒక గేట్ ద్వారా 330 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తి నీటిమట్టం 1764 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం1761 అడుగులుగా ఉంది. దీంతో మూసీలోకి భారీగా ప్రవాహం తగ్గడంతో... మూసీ పరివాహక ప్రాంతాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి.