భారీ వర్షాలు.. రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం..

Update: 2020-10-11 06:52 GMT

బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత మరింత బలపడి తీవ్ర వాయుగుండముగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో రేపు తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలంగాణలోని ఆదిలాబాద్, కోమురంభీం – ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు... ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అక్టోబర్ 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News