సికింద్రాబాద్‌లో మోండా మార్కెట్‌లో ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం ధ్వంసంపై తీవ్రంగా మండిపడ్డారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ముస్లిం వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టం కనిపిస్తోందన్నారు. ఘటనా స్థలానికి వెళ్దామంటే తనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు పిచ్చి ముదిరితే హిందూ ఆలయాలే కనిపిస్తాయా అని ప్రశ్నించారు