తెలంగాణ బీజేపీలో మరో శకం మొదలైంది. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామచందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు, ఆయన్ను గజమాలతో ఘనంగా సత్కరించారు.
అంతకుముందు తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వచ్చిన రామచందర్ రావు.. ఓయూ లోని సరస్వతీ దేవి ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా పార్టీ ఆఫీసుకు వచ్చి బాధ్యతు స్వీకరించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రాంచందర్ రావు తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నరు