షర్మిల పార్టీ వెనుక వారి పాత్ర ఉండొచ్చు: మాజీమంత్రి దామోదర్‌రెడ్డి

ఆంధ్రా వ్యక్తుల పార్టీలకు తెలంగాణలో స్థానం లేదన్నారు దామోదర్‌రెడ్డి;

Update: 2021-02-11 11:52 GMT

షర్మిల పార్టీ వెనుక టీఆర్‌ఎస్‌, బీజేపీ పాత్ర ఉండొచ్చని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు చీల్చే కుట్రలా కనిపిస్తోందని అన్నారు.

రాజన్న రాజ్యం కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్పష్టంచేశారు. ఆంధ్రా వ్యక్తుల పార్టీలకు తెలంగాణలో స్థానం లేదన్న దామోదర్‌రెడ్డి.. పార్టీ పెట్టే ముందు తెలంగాణకు ఏం చేశారో షర్మిల చెప్పాలని సవాల్‌ చేశారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్‌ నేతలెవరూ షర్మిల పార్టీలోకి వెళ్లరని అన్నారు.


Tags:    

Similar News