అవునా.. నిజమా.. ఆరు లక్షలకే ఇల్లా!!
ఇల్లంటే సిమెంట్, ఇటుకలు, ఇసుక కంపల్సరీ. కానీ అవేవీ లేకుండానే ఆధునిక హంగులతో ఈ ఇంటిని డిజైన్ చేశారు.;
ఎండకీ, వానకి తడవకుండా ఏదో ఒక ఇల్లుంటే సరిపోతుందనుకున్నా.. లక్షల్లో ఖర్చు. ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు పని.. అంత టైమ్ లేదంటే రెడీమేడ్ ఇల్లుకి రెడీ అయిపోవడమే. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన చింత అనంతరాంరెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఈ ఇంటిని ఏర్పాటు చేశారు.
ఇల్లంటే సిమెంట్, ఇటుకలు, ఇసుక కంపల్సరీ. కానీ అవేవీ లేకుండానే ఆధునిక హంగులతో ఈ ఇంటిని డిజైన్ చేశారు. నలుగురు శుభ్రంగా ఈ ఇంటిలో ఉండొచ్చంటున్నారు. ఇందులో ఒక హాలు, బెడ్రూం, కిచెన్, టాయ్‌లెట్ ఇలా ఇంటికి కావలసిన సదుపాయాలన్నీ ఉన్నాయి. తగిన వసతులన్నీ ఈ ఇంటిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఖర్చు పెట్టినట్లు అనంతరాంరెడ్డి చెప్పారు. ఆదివారం ట్రాలీ లారీ సాయంతో హైదరాబాద్ నుంచి గ్రామానికి ఈ ఇల్లుని తీసుకొని వచ్చారు.
వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఎనిమిది అడుగుల సిమెంట్ పిల్లర్లపై రెండు క్రేన్ల సాయంతో రెడీమేడ్ ఇంటిని అమర్చారు.