తెలంగాణ రాష్ట్రంలో దక్షిణకాశిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానానికి హుండీ ద్వారా కోటి 28 లక్షల ఆదాయం లభించింది. దేవస్థానం హుండీలను ఆలయ ఓపెన్ స్లాబ్‌లో అధికారులు సిబ్బంది లెక్కించారు. గత ఏడు రోజులకు ఆలయ ఖజానాకు 1 కోటి 28 లక్షల 78 వేల 106 నగదు సమకూరింది. అలాగే బంగారం 305 గ్రాములు, వెండి 8 కిలోల 200 గ్రాములు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆదాయం ఏటికేడు పెరుగుతోందని ఆలయ అధికారులు తెలిపారు.