హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. 2 గంటల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో సరూర్ నగర్, హిమాయత్ నగర్‌లో 84.8mm, చార్మినార్ 84mm, ముషీరాబాద్‌లో 80.5mm వర్షపాతం నమోదైంది. దాదాపు అన్నిచోట్ల 66mm పైనే వాన కురిసింది. ఏప్రిల్‌లో ఈస్థాయి వర్షం పడటం ఇదే తొలిసారని తెలుస్తోంది. కాగా అకాల వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో GHMC కమిషనర్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏవైనా వర్ష సంబంధిత సమస్యలు ఉంటే సాయం కోసం 040-21111111 నంబర్‌ను సంప్రదించాలని సిటిజన్లకు సూచించారు. ఇప్పటికే నీరు నిలిచిన ప్రాంతాలను క్లియర్ చేసినట్లు తెలిపారు.