RTC MD VC Sajjanar : రీల్స్ పిచ్చి బాధాకరం .. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్

Update: 2025-07-08 07:00 GMT

సోషల్ మీడియా పట్ల పిల్లల తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఇవాళ ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారాయన. తల్లిదండ్రు లకు సూచనలు ఇచ్చారు. చిన్నతనం నుంచే రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురైతుండటం అత్యంత బాధాకరమన్నారు. సోషల్ మీడియా మత్తులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకై నా వెనుకాడడం లేదని తెలిపారు. ' ఒడిషాలో ఇటీవల కొంత మంది మైనర్లు రన్నింగ్ ట్రైన్ ముందు ప్రమాదకరంగా రీల్స్ చేశారు. ఓ బాలుడు రైల్వే పట్టాల మధ్యలో స్లీపర్ల మధ్య పడుకున్నాడు. మరో ఇద్దరు అతన్ని వీడియో తీస్తున్నారు. అప్పుడు రైలు పట్టాల మీద పడుకున్న వ్యక్తి నుంచి రైల్ స్పీడ్గా వెళ్లిపోయింది. ఆ తర్వాత లేచి అరుస్తున్నాడు.. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇలాంటి సోషల్ మీడియా వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే.. ఎంతో మంది పిల్లలు, యువకుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన పిల్లలకు కౌన్సిలింగ్ అనేది అత్యవసరం. ఇందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే మీ పిల్లల జీవితాలను మీరే చేజేతులా నాశనం చేసిన వాళ్లుగా మిగిలిపోతారు. గుర్తుంచుకోండి.. ' అని సజ్జనార్ వీడియో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News