KTR : హైకోర్టులో ఊరట.. ఈడీ కొరడా... ఇరకాటంలో కేటీఆర్

Update: 2024-12-21 12:15 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 30వరకు అరెస్ట్‌ చేయొద్దంటూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. అంతకు ముందు కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై వాదనలు సాగాయి. కేటీఆర్‌పై నమోదు చేసిన FIR క్వాష్‌ చేయాలని కేటీఆర్‌ తరపు న్యాయవాది వాదించారు. మరోవైపు మధ్యంత ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏజీ సుదర్శన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్వాష్ పిటిషన్‌కు అర్జెన్సీ లేదన్నారు. దాంతో పది రోజులపాటు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దని కోర్టు ఆదేశించింది.

మరోవైపు.. ఫార్మూలా ఈ రేసు కేసులో కీలక పరిమాణం జరిగింది. కేటీఆర్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఎంత మొత్తంలో నగదు ట్రాన్స్ ఫర్ చేశారు.. ఏఏ తేదీల్లో ఇచ్చారన్న వివరాలు ఇవ్వాలని ఏసీబీని ఈడీ అధికారులు కోరారు. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు HMDA అకౌంట్‌ నుంచి..ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు కోరింది ఈడీ. దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని కోరింది. ఈడీ రంగంలోకి దిగడంతో కేటీఆర్ కు ఉచ్చు మరింతగా బిగుసుకుందనే ప్రచారం సాగుతోంది. 

Tags:    

Similar News