REVANTH: లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్

తెలంగాణ సీజేను కూడా కలిసిన రేవంత్

Update: 2026-01-01 10:00 GMT

తె­లం­గాణ సీఎం రే­వం­త్ రె­డ్డి.. లో­క్‌­భ­వ­న్‌­లో రా­ష్ట్ర గవ­ర్న­ర్ జి­ష్ణు­దే­వ్ వర్మ­ను మర్యా­ద­పూ­ర్వ­కం­గా కలి­శా­రు. నూతన సం­వ­త్స­రా­న్ని పు­ర­స్క­రిం­చు­కు­ని గవ­ర్న­ర్‌­కు ఆయన సీఎం శు­భా­కాం­క్ష­లు తె­లి­య­జే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా గవ­ర్న­ర్‌­కు శా­లు­వా కప్పి పు­ష్ప­గు­చ్ఛం, జ్ఞా­పి­క­ను అం­ద­జే­శా­రు. అనం­త­రం రా­ష్ట్రా­ని­కి సం­బం­ధిం­చిన పలు అం­శా­ల­పై ఇద్ద­రూ కా­సే­పు చర్చిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. మరో­వై­పు రే­వం­త్ రె­డ్డి నూతన సం­వ­త్స­రం సం­ద­ర్భం­గా రా­ష్ట్ర హై­కో­ర్టు ప్ర­ధాన న్యా­య­మూ­ర్తి అప­రే­శ్ కు­మా­ర్ సిం­గ్‌­ను మర్యా­ద­పూ­ర్వ­కం­గా కలి­శా­రు. స్వ­యం­గా ప్ర­ధాన న్యా­య­మూ­ర్తి ని­వా­సా­ని­కి వె­ళ్లిన ము­ఖ్య­మం­త్రి, ఆయ­న­కు నూతన సం­వ­త్సర శు­భా­కాం­క్ష­లు తె­లి­య­జే­సి పూ­ల­గు­చ్ఛా­న్ని అం­ద­జే­శా­రు. రా­ష్ట్ర ప్ర­జ­లం­ద­రి­కీ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి హృ­ద­య­పూ­ర్వక నూతన సం­వ­త్సర శు­భా­కాం­క్ష­లు తె­లి­పా­రు. నూతన సం­వ­త్స­రం ప్ర­తి ఒక్క­రి జీ­వి­తం­లో కొ­త్త ఆశలు, వి­జ­యా­లు, సం­తో­షా­లు తీ­సు­కు­రా­వా­ల­ని ఆకాం­క్షిం­చా­రు. 2026 సం­వ­త్స­రం తె­లం­గాణ పు­రో­గ­తి­లో అద్భు­త­మైన మై­లు­రా­ళ్ల­ను అధి­గ­మి­స్తుం­ద­ని ఆయన వి­శ్వా­సం వ్య­క్తం చే­శా­రు.

శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం కుటుంబం

తె­లం­గాణ ఉప ము­ఖ్య­మం­త్రి మల్లు భట్టి వి­క్ర­మా­ర్క నూతన సం­వ­త్సర ప్రా­రం­భం సం­ద­ర్భం­గా తి­రు­మల శ్రీ వేం­క­టే­శ్వర స్వా­మి­ని దర్శిం­చు­కు­న్నా­రు. కు­టుంబ సభ్యు­ల­తో కలి­సి ఆల­యా­ని­కి చే­రు­కు­న్న ఆయ­న­కు టీ­టీ­డీ అధి­కా­రు­లు ఘన స్వా­గ­తం పలి­కా­రు. అనం­త­రం వై­కుంఠ ద్వా­రం ద్వా­రా శ్రీ­వా­రి­ని దర్శిం­చు­కు­ని మొ­క్కు­లు చె­ల్లిం­చు­కు­న్నా­రు. దర్శ­నా­నం­త­రం రం­గ­నా­య­కుల మం­డ­పం­లో వేద పం­డి­తు­లు ఆయ­న­కు ఆశీ­ర్వ­చ­నం పల­క­గా, అధి­కా­రు­లు స్వా­మి­వా­రి తీ­ర్థ­ప్ర­సా­దా­ల­ను అం­ద­జే­శా­రు.రెం­డు తె­లు­గు రా­ష్ట్రా­లు సు­భి­క్షం­గా, సం­తో­షం­గా ఉం­డా­ల­ని, ఆర్థి­కం­గా బలం­గా అభి­వృ­ద్ధి చెం­దా­ల­ని స్వా­మి­వా­రి­ని ప్రా­ర్ధిం­చి­న­ట్లు తె­లి­పా­రు. ము­ఖ్యం­గా తె­లం­గాణ రా­ష్ట్రం సర్వ­తో­ము­ఖా­భి­వృ­ద్ధి సా­ధిం­చా­ల­ని, ప్ర­జల ఆశ­యా­ల­కు అను­గు­ణం­గా ప్ర­భు­త్వం మరి­న్ని సం­క్షేమ పథ­కా­ల­ను అమలు చే­స్తూ ప్ర­గ­తి­ప­థం­లో ముం­దు­కు సా­గా­ల­ని ఆయన ఆకాం­క్షిం­చా­రు.

Tags:    

Similar News