TG : నీ బిడ్డ పెండ్లి అని కూడా చూడలేదు రేవంత్..అరెస్టుకు లేటెందుకు.? బండి సంజయ్ సంచలనం

Update: 2024-11-08 13:45 GMT

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే, కేసీఆర్ కొడుకు యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ తో రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని, అందుకే ఈ ఫార్ములా రేస్, రేవ్ పార్టీ, డ్రగ్స్, కాళేశ్వరంసహా అన్ని స్కాంలలో కేటీఆర్ ప్రధాన నిందితుడుని తేలిన తరువాత కూడా ఆయనను అరెస్ట్ చేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారని అన్నారు. ‘‘ఒకనాడు జన్వాఢ ఫాంహౌజ్ పై డ్రోన్ ఎగిరేశారనే కారణంతో నీ బిడ్డ పెళ్లని కూడా చూడనీయకుండా నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిర్రు. అట్లాంటిది ఇప్పుడు బయటపడుతున్న స్కాంలన్నింట్లోనే కేసీఆర్ కొడుకు ముద్దాయి అని తేలిన తరువాత కూడా ఎందుకు జైల్లో పెడతలేవ్. ఎందుకీ మీనమేషాలు’’అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ కొద్దిసేపు మీడియా మిత్రులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు

Tags:    

Similar News