CM Revanth Reddy : జూబ్లీహిల్స్ రణరంగంలోకి రేవంత్.. కాంగ్రెస్ లో జోష్..

Update: 2025-10-28 08:00 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రణరంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి దిగబోతున్నారు. ఇన్ని రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ప్రచారం నిర్వహించారు. నేటి నుంచి సీఎం రేవంత్ స్వయంగా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. నేడు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సినీ కార్మికుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ జరగబోతోంది. జూబ్లీహిల్స్ లో సినీ కార్మికులు ఎక్కువగా ఉండటం వల్ల వారి నుంచే ప్రచారం ప్రారంభించబోతున్నారు. రీసెంట్ గా సినీ కార్మికులు జీతాల పెంపు కోసం చేసిన పోరాటానికి సీఎం రేవంత్ మద్దతు తెలిపారు. వారికి అనుకూలంగా చర్చలు జరిగేలా మధ్యవర్తిత్వం వహించారు. కాబట్టి వారి మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ అభినందన సభతో కాంగ్రెస్ ప్రచారంలో జోష్ పెరుగుతుందని పార్టీ నేతలు అంటున్నారు.

దీని తర్వాత అక్టోబర్ 31న వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో రోడ్ షో నిర్వహిస్తారు. నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ ప్రాంతాలలో రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 4 న షేక్ పెటా1 రహమత్ నగర్, 5న షేక్ పేట -2, యూసఫ్ గూడ ప్రాంతాలలో రోడ్ షో లు నిర్వహిస్తారు. స్లమ్ ఏరియా ల నుంచి.. రిచ్ ఏరియాల దాకా అందరినీ కవర్ చేయబోతున్నారు. ఈ రోడ్ షోలలో రేవంత్ రెడ్డి కీలకంగా ప్రసంగించబోతున్నారు. ఆయన స్పీచ్ లో కీలక హామీలు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉంది కూడా జూబ్లీహిల్స్ లోనే కాబట్టి.. ప్రత్యేక హామీలు ఉంటాయని అంటున్నారు. ఆ హామీలు కచ్చితంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటిదాకా సాగిన ప్రచారం ఒక ఎత్తు అయితే.. సీఎం రేవంత్ రెడ్డి రాకతో జరిగే ప్రచారం మరో ఎత్తు అంటున్నారు.

ఇప్పటివరకు బిజెపి నుంచి రాష్ట్రస్థాయి నేతలు గానీ, జాతీయస్థాయి నాయకులు గానీ ప్రచారం చేయలేదు. గులాబీ పార్టీ అధినేత కెసిఆర్ కంటే ముందే రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగడం హస్తం పార్టీకి కలిసొస్తుందని.. వాళ్లకంటే తమ ప్రచారం ముందు వరసలో ఉంటుందని చెబుతున్నారు. ఎంతైనా అధికార పార్టీ కాబట్టి హామీలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్లను కవర్ చేస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించబోతుంది. ఆ ర్యాలీ ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని అంటున్నారు. ప్రతి డివిజన్ లో ఉండే సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా హామీలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రాకతో జూబ్లీహిల్స్ ఓటర్స్ చూపు కాంగ్రెస్ వైపే ఉంటుందని చెబుతున్నారు.

Tags:    

Similar News