Telangana High Court : హైకోర్టులో రేవంత్ పిటిషన్.. ముగిసిన వాదనలు

Update: 2025-07-07 12:45 GMT

సీఎం రేవంత్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతం వాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని రేవంత్‌ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై..

మరోవైపు ఖాజాగూడలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ భూమిలో భవనాలు నిర్మిస్తున్నారంటూ పిటిషనర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం సోహిణి బిల్డర్స్‌తోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News