నిబంధనలకు విరుద్ధంగా ORR టెండర్లు: రేవంత్ రెడ్డి
ఓఆర్‌ఆర్ దారి దోపిడీపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని నిలదీశారు;
ఓఆర్‌ఆర్ అగ్రిమెంట్ వివరాలన్నీ తన దగ్గరున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓఆర్‌ఆర్ టెండర్లు జరిగాయని ఆరోపించారు. లక్ష కోట్ల విలువైన ఆస్తిని కొల్లగొడుతున్న వారిపై.. మీరెందుకు విచారణకు ఆదేశించలేరని బీజేపీని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ దారి దోపిడీపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని నిలదీశారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కూడా ఫిర్యాదు చేశారని.. ఈ ఫిర్యాదును కిషన్ రెడ్డి, బండి సంజయ్ నమ్ముతున్నారా లేదా..? అని ప్రశ్నించారు.