Revanth Reddy: సీఎం కేసీఆర్, రెండు మీడియా సంస్థలపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు..
Revanth Reddy: భారత రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమాన పరిచారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.;
Revanth Reddy: భారత రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అవమాన పరిచారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి గజ్వెల్ పోలీస్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసీఆర్‌తో పాటు..మరో రెండు మీడియా సంస్థలపైన రాజద్రోహం కేసు నమోదుచేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసు నమోదుచేసి చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా దేశప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.