Revanth Reddy: రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఏముంది- రేవంత్‌రెడ్డి
Revanth Reddy: రాహుల్ గాంధీ పర్యటనతో కేసీఆర్, కేటీఆర్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.;
Revanth Reddy: రాహుల్ గాంధీ పర్యటనతో కేసీఆర్, కేటీఆర్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కలుగులోని నాయకులు ఒక్కొక్కరిగా బయటికొస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని.. చరిత్ర తెలుసుకుని కేటీఆర్ మాట్లాడితే బాగుంటుదని కౌంటరిచ్చారు.
తెలంగాణకు వచ్చేవాళ్లు పొలిటికల్ టూరిస్టులైతే మీరు దేశ దిమ్మరులా అని ప్రశ్నించారు రేవంత్. శరద్ పవార్, స్టాలిన్, మమత దగ్గరికి కేసీఆర్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఇవాళ ప్రకాష్‌రాజ్ అవసరం వచ్చిదని.. కావాలంటే జ్యోతిలక్ష్మి, జయమాలినిని కూడా తెచ్చుకోవచ్చని ఎద్దేవా చేశారు.