CM Revanth Reddy : సిగ్గుంటే హరీశ్ రాజీనామా చేయాలి.. రేవంత్ ఫైర్

Update: 2024-08-16 05:15 GMT

మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీ మేరకు తాము 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, హరీశ్ రావుకు సిగ్గుంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లాలోని వైరాలో ఏర్పాటు చేసిన మూడో విడత రైతు రుణమాఫీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డా అన్నారు. 2022 మే 6న చెప్పిన రైతు డిక్లరేషన్ ప్రకారం రుణమాఫీ చేసి చూపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News