జూబ్లీహిల్స్ పీఎస్‌లో రేవంత్‌రెడ్డి కంప్లైంట్
మంత్రి కేటీఆర్ పంపిన టీఆర్‌ఎస్ గుండాలు తన అనుచరులు, ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.;
మంత్రి కేటీఆర్ పంపిన టీఆర్‌ఎస్ గుండాలు తన అనుచరులు, ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. టీఆర్‌ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి.. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ లాంటి ప్రయోగాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్. అసలు తన భద్రత విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు.