Revanth Reddy : పేదల కోసం వంద సార్లైనా జైలుకు వెళ్లడానికి సిద్ధం : రేవంత్ రెడ్డి
Revanth Reddy : ఓట్ల కోసమే అమిత్‌షా, కేసీఆర్ మునుగోడు వచ్చారంటూ మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి;
Revanth Reddy : ఓట్ల కోసమే అమిత్‌షా, కేసీఆర్ మునుగోడు వచ్చారంటూ మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రశ్నించారు. పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచినందుకా అని నిలదీశారు. ఇక కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టారని మండిపడ్డారు. పేదల కోసం వంద సార్లయినా జైలు కెళ్లడానికి సిద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ... గిరిజనులకు పట్టాలిస్తే... ఇప్పడా భూములను కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.