Revanth Reddy: రెండు ప్రభుత్వాల మెడలు వంచి ధాన్యాన్ని కొనేలా చేస్తాం: రేవంత్‌రెడ్డి
Revanth Reddy: రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు రేవంత్‌రెడ్డి.;
Revanth Reddy (tv5news.in)
Revanth Reddy: రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఎల్లారెడ్డిలో మన ఊరు - మన పోరు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. రెండు ప్రభుత్వాల మెడలు వంచి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు. కవితను గెలిపిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని మాట ఇచ్చి 15 వందల రోజులైనా ఇంతవరకు ఊసే లేదన్నారు. ధర్మిపురి అర్వింద్ పసుపు బోర్డ్ తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మాట తప్పారన్నారు. ఏ పంట పండించాలని కాళేశ్వరం కట్టారో ప్రజలకు సమధానం చెప్పాలన్నారు.