Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి లేఖ.. రైతుల కష్టాలపై స్పందిస్తూ..
Revanth Reddy: తెలంగాణ ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.;
Revanth Reddy (tv5news.in)
Revanth Reddy: తెలంగాణ ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. కల్లాల్లో రైతులు కన్నీరు పెడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలో సేద తీరుతున్నారంటూ తీవ్రంగా ఫైరయ్యారు.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలో భాగమేనన్నారు.. కేసీఆర్ తీర్థయాత్రల వల్ల అయ్యేది లేదు.. పొయ్యేది లేదన్నారు.. వానాకాలం పంట కొనకుండా యాసంగి పంటపై ఈ పంచాయితీ ఏంటని ప్రశ్నించారు.. రైతులను పావులుగా చేసి టీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయ చదరంగం ఆడుతున్నాయని రేవంత్ ఫైరయ్యారు.. నిన్న, నేడు, రేపు ఎప్పుడూ కాంగ్రెస్ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.