Revanth Reddy : హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితంపై సంపూర్ణ బాధ్యత నాదే : రేవంత్ రెడ్డి
Revanth Reddy : అటు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై సంపూర్ణ బాధ్యత నాదేనన్నారు.;
Revanth Reddy : అటు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై సంపూర్ణ బాధ్యత నాదేనన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పార్టీ కార్యకర్తలను నిరాశపరిచిందన్నారు.. ఒక ఉప ఎన్నిక ఫలితంతో పార్టీ కార్యకర్తలు నిరాశ చెందాల్సిన పనిలేదన్నారు.. హుజురాబాద్ ప్రజల కోసం భవిష్యత్తులోనూ బల్మూరి వెంకట్ పోరాటం చేస్తారని గుర్తు చేశారు.
నివేదికలు తెప్పించుకుని విశ్లేషణ చేసుకుంటామని చెప్పారు.. రాబోయే రోజులన్నీ కాంగ్రెస్ పార్టీవే అన్నారు.. ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా కొట్లాడతామన్నారు.. హుజురాబాద్ ఉప ఎన్నికలు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగాయన్నారు రేవంత్ రెడ్డి.. ఈ ఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయించలేదన్నారు. ఈ ఓటమి నిరాశ శాశ్వతం కాదని, నిరాశ నుంచి నిర్మాణం చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులకు పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని, పార్టీ విషయాలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటామని చెప్పారు.. సీనియర్లు అందరూ విదేశాల నుంచి వెనక్కు రప్పించుకుని పార్టీ కార్యక్రమాల్లో కలుపుకునివెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.