Revanth Reddy: కాంగ్రెస్ పార్టీకి నేను కోడల్లాంటి వాడిని: రేవంత్ రెడ్డి
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీకి తాను కోడల్లాంటి వాడినంటూ కామెంట్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. పుట్టినిల్లు అయిన టీడీపీ నుంచి మెట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పారు.;
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీకి తాను కోడల్లాంటి వాడినంటూ కామెంట్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. పుట్టినిల్లు అయిన టీడీపీ నుంచి మెట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పారు. కోడలిగా వచ్చిన తనపై పార్టీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. తాను చంద్రబాబు మనిషినేనంటూ టీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని, ఆయన మనిషినైతే కాంగ్రెస్‌లో ఎందుకు ఉంటానని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
జైల్లో తిన్న చిప్పకూడు సాక్షిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కాంగ్రెస్‌ను ఇబ్బందిపెట్టాలని చూస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడులో డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని అన్నారు. రాష్ట్రంలోని కమ్యూనిస్టు నాయకులు కూడా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి తాను కోడలాంటి వాడిని: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య
పుట్టినిల్లు అయిన టీడీపీ నుంచి మెట్టినిల్లు లాంటి కాంగ్రెస్‌లోకి వచ్చా
కోడలిగా వచ్చిన తనపై పార్టీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది
చంద్రబాబు మనిషినంటూ టీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు
చంద్రబాబు మనిషినైతే కాంగ్రెస్‌లో ఎందుకు ఉంటానని రేవంత్ రెడ్డి ప్రశ్న
జైల్లో తిన్న చిప్పకూడు సాక్షిగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా: రేవంత్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్‌ను ఇబ్బందిపెట్టాలని చూస్తోంది
మునుగోడులో డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారు
కమ్యూనిస్టు నాయకులు కూడా కేసీఆర్‌కు అమ్ముడుపోయారన్న రేవంత్‌రెడ్డి