కేసీఆర్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు: రేవంత్‌రెడ్డి

Revanth Reddy: పెట్రోల్, డీజీల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలోరాజ్‌భవన్ కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది.

Update: 2021-07-16 08:49 GMT

Revanth Reddy: పెట్రోల్‌, డీజీల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలోరాజ్‌భవన్ కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. 'చలో రాజ్‌భవన్‌' కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన పోలీసులు...కార్యర్తలను అడుగుడుగనా అడ్డుకున్నారు. నిర్బంధం మధ్యనే కాంగ్రెస్ శ్రేణులు ఇందిరాపార్క్‌ సభకు భారీగా తరలివచ్చారు.

కాంగ్రెస్‌ శ్రేణుల ధర్నాతో ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ దద్దరల్లింది. చలో రాజ్‌భవన్ బయల్దేరేందుకు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులనుపోలీసులు అడ్డుకునేందుకు యత్నించటంతో... వాగ్వాదం చోటు చేసుకుంది. భారీ కేడ్లను తోసుకుంటూ...కాంగ్రెస్ శ్రేణులు ముందుకు వేళ్లేందుకు యత్నించారు. ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..బహిరంగసభలో మాట్లాడుతూ..అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలోనూ టీఆర్‌ఎస్‌లు ప్రజలను జలగళ్ల పీల్చుకుంటున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే..కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారన్న రేవంత్‌రెడ్డి...అధికారంలో ఎంతకాలం ఉంటారో కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలన్నారు. సామాన్యుడి నడ్డివిరుస్తున్న పెట్రోల్‌పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రూ.65 దోచుకుంటున్నాయని మండిపడ్డారు

Tags:    

Similar News