సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత మొదటిసారి పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈసారి కచ్చితంగా మెజార్టీ సీట్లను సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు అంట. అందులో భాగంగానే ఈసారి గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. 116 మున్సిపాలిటీలకు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరుగుతున్న సమయాన మంత్రుల మీద కీలక బాధ్యతలను పెట్టారు. ఆయా జిల్లాలకు మంత్రులను ఇన్చార్జులుగా నియమించి.. అక్కడ సెలెక్ట్ ప్రాసెస్ లో ఎన్నికలు జరిపి విజయం సాధించాలని లక్ష్యాలను నిర్దేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ ఎస్, బిజెపి పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చినవారు, కాంగ్రెస్ లో అంతకుముందు నుంచి ఉంటున్న వారి మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డికి తెలిసింది. ఇలాంటి గ్రూపు రాజకీయాలతో ఎన్నికల్లో విజయం సాధించలేమని రేవంత్ భావిస్తున్నారు. అందుకే పార్టీ లైన్ ఎవరూ దాటకుండా రెబల్స్ గా ఎవరూ పోటీ చేయకుండా అందరితో చర్చలు జరపాలని మంత్రులను ఆదేశించారు సీఎం రేవంత్. రెబల్స్ వల్ల భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ ను బుజ్జగించడం వల్ల ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ నుంచి ఒక్కరే పోటీ చేయటంతో భారీ సీట్లు సాధించగలిగారు.
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా రివర్స్ లేకుండా సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యతను సదరు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఇటు సీఎం కూడా ఆయా జిల్లాల్లో వరుసగా ప్రచార సభలో నిర్వహించబోతున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఇలాగే సభలు నిర్వహించి భారీగా సీట్లు సాధించారు కాబట్టి ఈసారి కూడా అలాంటి ప్లాన్ అమలు చేయాలని సీఎం వ్యూహ రచన చేస్తున్నారంట. మరి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందనేది చూడాలి.