లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ..!
పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలు సందర్భంగా సింహవాహిని మహంకాళి అమ్మవారిని రేవంత్ దర్శించుకున్నారు.;
మత సామరస్యాలకు ప్రతీక లాల్‌దర్వాజా బోనాలని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలు సందర్భంగా సింహవాహిని మహంకాళి అమ్మవారిని రేవంత్ దర్శించుకున్నారు. వంద సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరాన్ని కలరా వ్యాధి వణికిస్తే.. లాల్ దర్వాజా అమ్మవారు నగర ప్రజలను కాపాడిందని, నేడు కరోనా మహమ్మారి నుంచి మానవాళిని అమ్మవారు కాపాడాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇక హైదరాబాద్ అంటేనే సర్వమత సమ్మేళనమని.. ప్రపంచానికి సందేశం ఇవ్వాలన్నారు.