Revanth Reddy: కేసీఆర్‌కు హామీలు ఇవ్వడం తప్ప, అమలు చేయాలన్న సోయి లేదు: రేవంత్ రెడ్డి
Revanth Reddy: కేసీఆర్‌కు హామీలు ఇవ్వడం తప్ప, అమలు చేయాలన్న సోయి లేదంటూ మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.;
Revanth Reddy: కేసీఆర్‌కు హామీలు ఇవ్వడం తప్ప, అమలు చేయాలన్న సోయి లేదంటూ మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. VRAల సమస్యలపై కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. VRAల పరిస్థితి కట్టుబానిసల కంటే హీనంగా తయారైందన్నారు రేవంత్. గొడ్డు చాకిరి చేయించి, హక్కులు కాల రాస్తున్నారని మండిపడ్డారు. చాలీ చాలని జీతాలు, ఏళ్లతరబడి ప్రమేషన్లు లేక VRAలు దుర్భర పరిస్థితిలో ఉన్నారన్నారు.
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన పే స్కేల్ హామీ.. ఏళ్లు గడుస్తున్నా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. శేషాద్రి కమిటీ కంటి తుడుపు చర్యంటూ మండిపడ్డారు. వెంటనే VRAలకు పే స్కేల్ అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలన్నారు. విధినిర్వహణలో చనిపోయిన VRA కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.