Minister Ponnam Prabhakar : రోడ్డు ప్రమాద బాధితులకు వారంలోగా రూ.1.5 లక్షలు

Update: 2025-06-26 07:00 GMT

రోడ్డు ప్రమాదం జరిగిన వారం రోజుల్లోపు ఒక్కో బాధితుడికి 1.5 లక్షల వరకు చికిత్స అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై కింద ఎంప్యానల్ అయిన ప్రతి ఆస్పత్రిలో పథకం వర్తిస్తుందని తెలిపారు. నగదు రహిత చికిత్స పథకం తీసుకొచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి ధన్యవాదాలు చెప్పారు. మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 162 ప్రకారం భారత ప్రభుత్వం ‘రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం 2025"ను ప్రా రంభించింది. ఈ స్కీం తెలంగాణలో అమలు పై రవాణా, పోలీస్, హెల్త్, ఇన్సూరెన్స్, ఎస్ఐసీ, విభాగాల అధికారులతో సచివాలయంలోని తన చాంబర్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం ని ర్వహించారు. ఈసందర్భంగా పొన్నం మాట్లా డుతూ 'రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరూ చని పోకుండా ఉండడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రమాద సమాచారంపై పోలీసులు వెంటనే స్పందించాలి. వివరాలు ఈ దార్ లో నమోదు చేయాలి. రోడ్డు ప్రమాద బా ధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పథకంపై ప్రతి పోలీస్ స్టేషన్ లో అవగాహన కల్పించాలి' అని సూచించారు.

Tags:    

Similar News