TG : హైదరాబాద్‌లో సడెన్‌గా కుంగిన రోడ్డు

Update: 2024-09-14 01:30 GMT

మియాపూర్ దీప్తిశ్రీ నగర్ కాలనీలో ఒక్కసారిగా రోడ్డు కుంగింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల గొయ్యి ఏర్పడటంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కుంగిన రోడ్డు పక్కనే వాటర్ పైప్ లైన్, డ్రైనేజీ పైప్ లైన్‌లు ఉన్నాయి. స్థానికుల సమాచారంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు గొయ్యి ఏర్పడ్డ మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. అధికారులు గొయ్యిని త్వరగా పూడ్చాలని కోరుతున్నారు దీప్తిశ్రీ నగర్ కాలనీ ప్రజలు. 

Tags:    

Similar News