కుల మతాలకు అతీతంగా స్వెరో పనిచేస్తుందన్నారు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. గుట్కా, మత్తుపదార్థాలు, గంజాయి, వరకట్నానికి వ్యతిరేకంగా స్వేరో పని చేస్తుందన్నారు. సిద్దిపేటలోని కృతుంగా హోటల్‌లో స్వేరో నేషనల్ కన్వెన్షన్ పోస్టర్‌ను ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. జ్ఞాన సమాజమే లక్ష్యంగా విదేశాల్లో కూడా స్వెరో నెట్‌వర్క్ పనిచేస్తుందన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్ అయినా విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించడం జరిగిందన్నారు. ఈ నెల 27న బెజ్జంకిలో స్వెరోస్ నేషనల్ కన్వెన్షన్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్త స్వెరోస్ సభ్యులు పాల్గొంటారు.