Mohan Bhagwat : సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్..!
Mohan Bhagwat : ముచ్చింతల్‌లో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.;
Mohan Bhagwat : ముచ్చింతల్‌లో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. సమతా మూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించారు. ఆయనతోపాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులుసైతం రామానుజా చార్యులను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వీరికి చినజీయర్ స్వామితోపాటు వేద పండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని దేవాలయాలను పరిశీలించారు. యాగశాలల్లోని పూజాధి కార్యక్రమాలను జీయర్ స్వామి వారికి వివరించారు.