RTC BUS : వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు...!
RTC BUS : భారీ వర్షాలకు వాగులో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట శివారు మానేరు వాగులో నిన్న సాయంత్రం వరదల్లో బస్సు చిక్కుకుపోయింది.;
RTC BUS : భారీ వర్షాలకు వాగులో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట శివారు మానేరు వాగులో నిన్న సాయంత్రం వరదల్లో బస్సు చిక్కుకుపోయింది. జేసీబీ సాయంతో తీయడానికి ప్రయత్నించినా వరద ఉధృతి పెరగడంతో ఇవాళ్టికి ప్రయత్నాన్ని వాయిదా వేశారు. అయితే ఇవాళ ఉదయం నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు కొట్టుకుపోయింది. గంభీరావుపేట శివారులో మానేరు వాగు ఉప్పొంగడంతో వరద రోడ్ల మీదకు వచ్చింది. ఓ బ్రిడ్జి వద్ద నీరు ప్రవహిస్తుండగా సిద్దిపేట డిపోకు చెందిన బస్సును ముందుకు పోనిచ్చాడా డ్రైవర్. దీంతో బస్సు వరద ఉధృతికి మధ్యలో ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తెచ్చారు. జేసీబీ సాయంతో బస్సును తీయడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అయితే ఇవాళ నీటి ప్రవాహం పెరగడంతో బస్సు కొట్టుకుపోయింది.