TG : గ్రూప్-1లో ఆర్టీసీ విజయం.. ఎండీ సజ్జనార్ సన్మానం

Update: 2025-04-03 11:30 GMT

రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ ఉద్యోగాలుగా భావించే గ్రూప్-1లో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు రాణించడం ఎంతో గర్వించ దగిన విషయమని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ బసవన్ గ్రూప్-1లో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను సన్మానించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో నారాయణపేట డిపోకు చెందిన కండక్టర్ ఎరుకలి శ్రీనివాస్ కూతురు వీణ 118వ ర్యాంకు, టీఐ-2 పని చేస్తున్న వాహిద్ కూతురు ఫాహిమినా ఫైజ్ 126వ ర్యాంకు, వనపర్తి డిపోలో పని చేస్తోన్న టీఐ-2 ఎస్.బాల్ రెడ్డి, కండక్టర్ బి. పుష్పలతల కుమారుడు రాఘ వేందర్రెడ్డి 143 ర్యాంకులను సాధించారు. అసమాన ప్రతిభను కనబరిచి గ్రూప్-1 ఉద్యోగాలు సాధించిన వారికి అభినందనలు తెలియజేశారు. ఉద్యో గాలు సాధించిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా సన్మానిం చారు. ప్రజా రవాణా వ్యవస్థకు వారి తల్లిదండ్రుల చేస్తోన్న సేవ, కష్టించే తత్వాన్ని ఆదర్శంగా తీసుకుని నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని వారికి సజ్జనార్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఉషా దేవి, డిప్యూటీ సీపీఎం శీరిష, నారాయణపేట డీఎం లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News