Secunderabad : రూబీ హోటల్ అగ్ని ప్రమాదం దర్యాప్తు వేగవంతం.. రంగంలోకి కేంద్ర రవాణా శాఖ..

Secunderabad : సికింద్రాబాద్‌ రూబీ హోటల్‌ ఘటనలో దర్యాప్తు వేగవంతం చేశారు

Update: 2022-09-14 08:57 GMT

Secunderabad : సికింద్రాబాద్‌ రూబీ హోటల్‌ ఘటనలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఎలక్ట్రిక్‌ బైక్‌ల ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణాశాఖ రంగంలోకి దిగింది. ఇద్దరు అధికారులతో కమిటీ వేసింది. బ్యాటరీలు ఎందుకు పేలాయి? సరైన జాగ్రత్తలు తీసుకోలేదా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందేశారు పోలీసులు. బ్యాటరీ పేలుళ్లే ప్రమాదానికి కారణమన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఈ-బైక్‌ బ్యాటరీలు పేలిన ఘటనలతో అలర్ట్‌ అయ్యారు.

అటు.. నలుగురు నిందితులు టాస్క్‌ఫోర్స్‌ అదుపులో ఉన్నారు. రంజిత్‌ సింగ్‌ బగ్గా, సుమిత్‌ సింగ్‌ బగ్గాతో పాటు.. మేనేజర్‌ సుదర్శన్‌నాయుడు, సూపర్‌వైజర్‌ను అరెస్ట్‌ చేశారు. మేడ్చల్‌లోని ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్న.. తండ్రికొడుకులు రంజిత్‌ సింగ్‌, సుమిత్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఘటనపై అగ్నిమాపక శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రమాదం జరిగితే 15 నిమిషాల తర్వాత ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఫోన్‌ చేశారని పేర్కొంది. లిథియం బ్యాటరీ పేలుళ్ల కారణంగానే దట్టమైన పొగలు వ్యాపించాయని.. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని వెల్లడించింది.

Tags:    

Similar News