రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం నిధుల పంపిణీ ప్రక్రియ తెలంగాణలో కొనసాగుతోంది. ఇప్పటికే రెండెకరాల లోపు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం తాజాగా బుధవారం నుంచి మూడెకరాల లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధుల పంపిణీకి గాను రైతుల ఖాతాల్లో 1,230 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. మూడు ఎకరాల లోపు సాగు భూమికిగాను 9,54,422 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 1230.98 కోట్లు జమ అయ్యాయి. ఇప్పటి వరకు ఎకరా, రెండెకరాలు, మూడెకరాల లోపు రైతులకు మూడు విడతల్లో కలిపి మొత్తం 58 లక్షల 13 వేల ఎకరాలకు 3487.82 కోట్ల రూపాయల మేర నిధులు 44,82,265 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.