Sabitha Indra Reddy: మైనింగ్ కేసు నుంచి విముక్తి కావాలి....

అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న విద్యాశాఖ మంత్రి; కేసు నుంచి విముక్తి కోరుతూ హై కోర్టులో పిటిషన్

Update: 2023-01-25 09:29 GMT

తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హై కోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో తనపై సీబీఐ చేసిన అభియోగాల నుంచి విముక్తి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులో  మైనింగ్ మాఫియా కింగ్ జనార్ధన్ రెడ్డికి సహకారం అందించిన విషయంల ో సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.


అయితే అక్డోబర్ 2022లో ఇదే విధంగా కేసు నుంచి విముక్తి కొరుతూ సబిత, ఏపీ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ, మాజీ మైన్స్, జియాలజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ అబ్యర్ధనలు సీబీఐ తోసిపుచ్చింది. అయినప్పటికీ తాము తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాము తప్పితే, ఇతర వ్యవహారాల్లో తలదూర్చలేదని వారు స్పష్టం చేశారు. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సబితా మైనింగ్ శాఖా మంత్రిగా సేవు అందిస్తున్న సమయంలో కూర్పనందం, శ్రీలక్ష్మీ  పరిశ్రమల శాఖ, మైన్స్ విభాగ సెక్రటరీల్లో  పనిచేస్తున్నారు. అదే సమయంలో జనార్ధన్ రెడ్డిసి సహకరిస్తున్నరాన్న అభియోగాలను ఎదుర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ పిటిషన్ హియరింగ్ కు రానుంది.


Tags:    

Similar News