SAD: సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం..45 మంది మృతి... ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయిన కుటుంబాలు.. 20 మంది మహిళలు, 11 మంది చిన్నారుల మృతి

Update: 2025-11-18 03:30 GMT

సౌదీ అరే­బి­యా­లో జరి­గిన ఘోర రో­డ్డు ప్ర­మా­దం­లో హై­ద­రా­బా­ద్‌­లో­ని వి­ద్యా­న­గ­ర్‌­కు చెం­దిన నజీ­రు­ద్దీ­న్‌ కు­టుం­బం­లో­ని 18 మంది మృతి చెం­దా­రు. నజీ­రు­ద్దీ­న్‌ ఓ వి­శ్రాంత రై­ల్వే ఉద్యో­గి. తన కు­టుంబ సభ్యు­ల­తో కలి­సి మక్కా యా­త్ర­కు వె­ళ్లా­రు. అం­త­లో­నే ఈ ఘోర ప్ర­మా­దం వారి కు­టుం­బా­న్ని కబ­ళిం­చిం­ది. ఈ ప్ర­మా­దం­లో హై­ద­రా­బా­ద్ కు చెం­దిన మొ­త్తం 45 మంది సజీవ దహ­న­మ­య్యా­రు. మృతి చెం­దిన వా­రి­లో 17 మంది పు­రు­షు­లు, 18 మంది మహి­ళ­లు, 10 మంది చి­న్నా­రు­లు ఉన్న­ట్లు పే­ర్కొం­ది.

సౌదీకి ప్రభుత్వ కమిటీ

సౌదీలో ఘోర ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు సజీవ దహనం కావడంపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, ఒక మైనార్టీ అధికారితో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వెంటనే సౌదీ వెళ్లి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే అక్కడికి ఎవరెవరు వెళ్లారు.. ఎలా వెళ్లారనే దానిపై ఓ స్పష్టతకు వచ్చినట్లు మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ వెల్లడించారు.

అక్కడే దహన సంస్కారాలు

బా­ధిత కు­టుం­బీ­కుల ఒక్కొ­క్క­రి ఇంటి నుం­చి ఇద్ద­రి­ని తీ­సు­కె­ళ్ల­ను­న్నా­రు. చని­పో­యిన వా­రి­కి సం­ప్ర­దా­యం ప్ర­కా­రం అక్క­డే దహన సం­స్కా­రా­లు చే­య­ను­న్నా­రు. మొ­త్తం నా­లు­గు ట్రా­వె­ల్‌ ఏజె­న్సీల ద్వా­రా ఈనెల 9న హై­ద­రా­బా­ద్‌ నుం­చి వీ­రం­తా ఉమ్రా­కు బయ­ల్దే­రా­రు. వి­జ­య­వం­తం­గా మక్కా యా­త్ర పూ­ర్తి­చే­సు­కు­ని మదీ­నా­కు వె­ళ్తు­న్న సమ­యం­లో రో­డ్డు ప్ర­మా­దం జరి­గిం­ది. మదీ­నా­కు 25 కి.మీ దూ­రం­లో బస్సు-డీ­జి­ల్‌ ట్యాం­క­ర్‌ ఢీ­కొ­న్నా­యి. ఈ ప్ర­మా­దం­లో మొ­త్తం 45 మంది సజీవ దహ­న­మ­య్యా­రు. దీ­ని­పై ప్ర­ధా­ని మోదీ ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు.

బతికి బయటపడింది ఒక్కడే

సౌ­దీ­లో జరి­గిన బస్సు ప్ర­మా­దం­లో ఒకే కు­టుం­బా­ని­కి చెం­దిన ఏడు­గు­రు చని­పో­వ­డం కన్నీ­ళ్లు తె­ప్పి­స్తోం­ది. దైవ దర్శ­నా­ని­కి వె­ళ్లి తి­రి­గి­రా­ని లో­కా­ల­కు వె­ళ్లిన మృ­తుల కు­టుం­బాల ఆవే­దన వర్ణ­నా­తీ­తం­గా ఉంది. ఈ ఘట­న­లో ఒకే కు­టుం­బా­ని­కి చెం­దిన ఏడు­గు­రు చని­పో­గా.. బతి­కి బయ­ట­ప­డ్డ యు­వ­కు­ని పరి­స్థి­తి అగ­మ్య­గో­చ­రం­గా ఉంది. ప్ర­మా­దం­లో ఎని­మి­ది మం­ది­లో ప్రా­ణా­ల­తో బయ­ట­ప­డ్డా­డు షో­య­బ్ అనే యు­వ­కు­డు. తీ­వ్రం­గా గా­య­ప­డిన షో­య­బ్ ప్ర­స్తు­తం హా­స్పి­ట­ల్లో చి­కి­త్స పొం­దు­తు­న్నా­డు. మి­గి­లిన ఏడు­గు­రు చని­పో­యి­న­ట్లు­గా గు­ర్తిం­చా­రు. మహ­మ్మ­ద్ అబ్దు­ల్ కధీ­ర్ (షో­య­బ్ తం­డ్రి, గౌ­సి­యా బేగం (షో­య­బ్ తల్లి) తో­పా­టు బం­ధు­వు­లు మహ­మ్మ­ద్ మౌ­లా­నా (గౌ­సి­యా తం­డ్రి, షో­య­బ్ తాత), రహీ­మ్ ఉని­షా, రె­హ­మ­త్ బి, మహ­మ్మ­ద్ మన్సూ­ర్ చని­పో­యా­రు. వీ­రి­తో పాటు మరొ­క­రు ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది.

Tags:    

Similar News