తెలంగాణ రాష్ట్ర నూతన ఆర్థిక కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి, మాజీ క్రీడా కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు.1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి సుల్తానియా , 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి కె. రామ కృష్ణారావు స్థానంలో తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. రెండు వారాల క్రితం రామ కృష్ణారావు తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంగతి తెలిసిందే. నేడు (మే 13) సాయంత్రం లేదా రేపు ఉదయం సందీప్ సుల్తానియా తన కొత్త బాధ్యతలు అధికారికంగా చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు.సుల్తానియాను ఆర్థిక శాఖకు నియమించడంపై అధికార వర్గాల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విధానాల అమలు, బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక అనుభవం కలిగిన అధికారిగా ఆయనకు మంచి పేరు ఉంది.